సైబరాబాద్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్భందికి రివార్డులు

నమస్తే శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ఎస్‌ఓ‌టి శంషాబాద్, సి‌సి‌ఎస్ శంషాబాద్, మియాపూర్, మేడ్చల్ పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బందిని ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గురువారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఓ‌టి శంషాబాద్, సి‌సి‌ఎస్ శంషాబాద్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించినందుకు ఎస్‌ఓ‌టి శంషాబాద్ సిబ్బంది ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్‌ఐ రవి, 13 మంది కానిస్టేబుళ్లను, ఎస్‌ఓ‌టి శంషాబాద్ సిబ్బంది, ఏ‌డి‌సి‌పి నరసింహ రెడ్డి, ఏ‌సి‌పి శశాంక్ రెడ్డి , ఇన్ స్పెక్టర్ నరసింహ, ఎస్‌ఐ మాధవ రెడ్డి, ఆరుగురు కానిస్టేబుళ్లకు క్యాష్ రివార్డు అందజేశారు.

  • మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మయూర్ నగర్ పరిధిలో జరిగిన స్నాచింగ్ కేసులను ఛేదించిన మియాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇన్ స్పెక్టర్ తిరుపతి రావు , డి‌ఐ కాంతారెడ్డి, డి‌ఎస్‌ఐ జగదీశ్వర్, 8 మంది కానిస్టేబుళ్లకు క్యాష్ రివార్డు అందజేశారు.
  • మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం లో జరిగిన ఫోన్లు, ల్యాప్ టాప్ చోరీని ఛేదించినదుకు మేడ్చల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇన్ స్పెక్టర్ రాజశేకర్ రెడ్డి, ఏ‌ఎస్‌ఐ రామ్ చందర్, ఇద్దరు కానిస్టేబుళ్లకు క్యాష్ రివార్డు అందజేశారు.

ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., బాలానగర్ డీసీపీ సందీప్, ఏడీసీపీ క్రైమ్స్ నరసింహ రెడ్డి, ఏసీపీ లు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు, ఎస్‌ఐ లు, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

సైబరాబాద్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్భందికి రివార్డులు అందజేస్తున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here