- మల్లని రాజేష్ కి మంజూరైన టెంట్ హౌస్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
- మరింత ఉన్నతి సాధించాలని ఆకాంక్ష
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ కి చెందిన మల్లని రాజేష్ కి దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన టెంట్ హౌస్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దశలవారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని , ఈ సంవత్సరంలో 2000 మంది లబ్ధిదారులకు అవకాశం కలిపిస్తామని పేర్కొన్నారు. దళితబంధు పథకం నుంచి టెంట్ హౌస్ సామగ్రి, ఇతర పరికరాలను లబ్ధిదారులకు అందించడం సంతోషకరమైన విషయమని, వివాహాది, శుభకార్యాలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. లబ్ధిదారులను సత్కరించారు. వారు ఎన్నుకున్న రంగాలలో మరింత ఉన్నతి సాధించాలని వారి కుటుంబాలలో వెలుగులు నిండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దినసరి కూలి నుండి టెంట్ హౌస్ ఓనర్ గా మార్చిన సందర్భంగా స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు లబ్ధిదారుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, తెరాస నాయకులు BSN కిరణ్ యాదవ్, రఘునాథ్ రావు, మహేందర్ ముదిరాజ్, అశోక్, రాజు, యాదగిరి, నాగరాజు, జ్ఞానేశ్వర్ , కేశవ పాల్గొన్నారు.