- కార్మికులకు సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ
నమస్తే శేరిలింగంపల్లి : సిఐటియు రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని చందానగర్ పీజేఆర్ స్టేడియం ముందు సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ ఆధ్వర్యంలో గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సిఐటియూ జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మూలంగా పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగింది, కార్మికులకు కనీస వేతనాలు కూడా అనేక పరిశ్రమలలో అమలు చేయకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారు, కార్మికుల పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలు గు లేబర్ కోడుగా మార్చి యాజమాన్యాలకు వారిని కట్టు బానిసల్లాగా మారుస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం కార్మికులకు కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని, జిహెచ్ఎంసి కార్మికులకు కనీస వేతనం 21000 ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని కోరారు. కార్మికుల సమస్యల పైన రాజీ లేకుండా పోరాడుతున్న సిఐటియూకు మద్దతుగా నిలిచి ఈ నెల 15 , 16 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగే రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ జీవోలను సవరించకుండా, గెజిట్ చేయకుండా కార్మికుల జీవితాలతో ఆడుకుంటురని, కంపెనీలు ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ ఆస్పత్రిలో, షాపింగ్ మాల్స్ లో కనీసం కనీస వేతనం కల్పించాలని కోరుతున్నామని అన్నారు. కార్యక్రమంలో శేర్లింగంపల్లి సిఐటియూ నాయకులు రవి శంకర్, శాంతయ్య , జ్యోతి, సువర్ణ, వరలక్ష్మి పాల్గొన్నారు.