- మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా, కార్పొరేటర్లతో కలిసి ర్యాలీగా బయలుదేరిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు ఓ. వెంకటేష్, గురు చరణ్ దుబే, నరేందర్ బల్లా పాల్గొన్నారు.