నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ మాజీ వైస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర నాయకులు నంద కుమార్ యాదవ్ భాగస్వామం అయ్యారు. ఈ సందర్భంగా నంద కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా కోమటిరెడ్డి గెలుపు తథ్యం అన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, ఇప్పటికే బిజెపి పక్షాన నిలబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.