నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సెప్టెంబర్ నెల నివేదిక ను సూపరింటెండెంట్ డా. వరదచారీతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా కొండాపూర్ జిల్లా ఆసుపత్రి పనిచేస్తుందని, పేదలకు ఒక వరం లాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల నివేదికను విడుదల చేశారు. సెప్టెంబర్ నెలలో 310 కాన్పులు జరిగాయని, వీటిలో సాధారణ కాన్పులు 189, ఆపేరేషన్ ద్వారా 121, ఇప్పటి వరకు మొత్తము ఆపరేషన్లు 23,015. ఇన్ పేషేంట్ లు – 1045, ఆర్థోపెడిక్ ఆరోగ్య కేస్ లు 37, కంటి శస్త్ర చికిత్సలు లు 06, ప్రతి రోజు ఇన్ పేషెంట్ ల సంఖ్య 200, ఔట్ పేషెంట్ ల సంఖ్య — 700, బ్లడ్ బ్యాంక్ కొత్త పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు. మొత్తం డాక్టర్ల సంఖ్య — 30, మొత్తం నర్సుల సంఖ్య — 25 గా ఉన్నాయని, అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను, శుచి, శుభ్రత ను పరిగణలోకి తీసుకొని జాతీయ హెల్త్ మిషన్ గతంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ అందచేసిన సంగతిని gurth చేశారు. ఆసుపత్రిలో ఒకప్పుడూ 40 నుండి 50 వరకు జరిగే ప్రసూతి సేవలు ఇప్పుడు కేసీఆర్ కిట్ వంటి వినూత్న పథకం ద్వారా ప్రతి నెల 350 వరకు ప్రసూతి సేవలు జరుగుతున్నాయను వెల్లడించారు. సీఎం కేసీఆర్ కృషితో ప్రభుత్వ వైద్యం ప్రయివేటుకు దీటుగా అందుతున్నదని అన్నారు. ప్రభుత్వ జిల్లా వైద్య శాలలో వైద్యం కోసం వచ్చే రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి రూ. 23 లక్షల అంచనావ్యయం తో లిఫ్ట్ ను నిర్మించిన సంగతి విదితమే. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వరదచారీ , చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ , మియాపూర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.