అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహమ్మద్ ఓవైస్ ( 34), భార్య ఆశ్రియతో కలిసి హఫీజ్ పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్లో నివసిస్తున్నారు. అయితే  ఓవైస్ తన భార్య తో 7వ తేదీన అప్పుల విషయం గురించి చర్చించి తరువాత బాదపడుచు బెడ్రూం లోకి వెళ్ళి పడుకున్నాడు. ఉదయం 11 గంటల సమయములో ఆశ్రియ జదీన్ తన భర్త ను నిద్రలేపడానికి వెళ్ళి అతని బెడ్రూం డోరు కొట్టగా తలుపు తీయకపోవడముతో.. ఆమె తలుపు సందులోంచి చూడగా మహమ్మద్ ఓవైస్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆమె చుట్టు పక్కల వారి సహాయముతో అతడిని ఉరినుండి కిందకు దింపారు. కానీ అప్పటికే మహమ్మద్ ఓవైస్ మరణించినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here