నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామంలో స్టేట్ హ్యాండ్లూమ్ దసరా ఉత్సవాల సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అజయ్ చక్రవర్తి , సప్ప శివ కుమార్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా కళాకారులు వినాయక కౌతం, గజాననయుతం, మామవతు శ్రీ సరస్వతి, అఖిలాండేశ్వరి, సిరుతానవ్వులా సిన్నక్క, జతిస్వరం, భామాకలాపం, మహేశ్వరి మహాకాళి, కళింగ నర్తన తిల్లాన, స్నేక్ డాన్స్, భోశంభో, స్వాగతం, సూర్యాష్టకం, హరివరసం, ఆనంద తాండవ, నమఃశివాయతేయ్, కదిరి నరసింహ, మరకత, అదిగో అల్లదిగో మొదలైన అంశాలను గ్రీష్మ, కార్తికేయ, అజయ్, దుర్గ, మైత్రేయి, ఆర్సీకా, శ్రీవిద్య, అనికా, సిరి, శృతి నాట్యం ను ప్రదర్శించి మెప్పించారు.