నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ తుల్జాభావని మాత దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తుల్జాభవని ఆలయ ఈవో సత్యచంద్రరెడ్డి , చైర్మన్ మల్లికార్జున శర్మ, ధర్మకర్తలు కృష్ణ యాదవ్ , గోవిందా చారి, సంపత్ గుప్త, మహేష్ గుప్త, విజయలక్ష్మి, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్ , పొడుగు రాంబాబు, నటరాజ్, కాశినాథ్ యాదవ్ పాల్గొన్నారు.