నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి గోల్ఫ్ రీడ్జ్ అపార్ట్మెంట్ లో ఈనెల 8న స్విగ్గీ డెలివరీ బాయ్ చేతిలో కత్తిపోట్లకు గురైన చెఫ్ ఆదిత్య చికిత్స పొందుతూ శుక్రవారం కేర్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారం రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిల్ రిడ్జ్ అపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆదిత్య ఫుడ్ డెలివరీకి ఆర్డర్ ఇచ్చాడు. ఫుడ్ ఆలస్యం కావడంతో చెఫ్ ఆదిత్య, స్విగ్గీ డెలివరీ బాయ్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఇంటి లోపలకి వెళ్లిన డెలివరీ బాయ్ ఆదిత్యను కత్తితో పొడిచాడు. అప్పటి నుండి చికిత్స పొందుతున్న బాధితుడు మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడు షేక్ హమీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.