గతంలో కూల్చేసిన చోట నిర్మాణాలు పూర్తి – తిరిగి చర్యలు తీసుకోవాలంటూ తహసిల్దార్ కు కసిరెడ్డి ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూమి, చెరువులను కాపాడటంలో రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతూ జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ వంశీ మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఆరు నెలల కిందట తాను ఫిర్యాదు చేయగా.. మియాపూర్ పరిధిలోని స.నెం.100 ప్రశాంత్ నగర్ లో ఒకటి, గంగారం బచ్చుకుంటలో మరోక నిర్మాణాన్ని రెవెన్యూ యంత్రాంగం కూల్చివేశారని ఐతే ప్రస్తుతం అక్కడే నిర్మాణాలు పూర్తి చేయబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై తిరిగి చర్యలు తీసుకోవాలని భాస్కర రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో కూల్చివేతకు గురైన నిర్మాణం

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here