నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా ఫేస్ 2 కాలనీలో Ghmc అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీలో చేపట్టే సీసీ రోడ్డు పనుల గురించి కాలనీ వాసులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దుసుకోపోతుందన్నారు. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, కాలనీవాసులు రాజయ్య, సత్తయ్య, విద్యాసాగర్, రమణరెడ్డి, కిషోర్, మధు సూధన్ రావు, పకిరయ్య, గంగాధర్, సత్యనారాయణ, అధికారులు ఏఈ శివ ప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్ రాజు పాల్గొన్నారు.