నమస్తే శేరిలింగంపల్లి: నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల జిల్లా స్థాయి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలను యావత్ ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా జరుపుకున్న విషయం విధితమే. అయితే దేశానికి 1947న స్వతంత్రం వచ్చినప్పటికిని, నైజాం పాలిత ప్రాంతంలో, ఎంతోమంది త్యాగాల, పోరాటాల ఫలితంగా, 13 నెలల తరువాత, సెప్టెంబర్ 17న భారత స్వాతంత్ర్య చిహ్నమైన త్రివర్ణ పతాకం ఎగురవేయడంతో బానిసత్వ చీకట్లు తొలిగించికొని స్వతంత్ర్య భారతం లో విలీనమైంది. 2023 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలను సెప్టెంబర్ 17 నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుపనున్నారు.
త్యాగధనులందరినీ స్మరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. తెలంగాణా ప్రజలకు వివిధ కార్యక్రమాలు, పోరాట యోధుల చరిత్ర ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తి, ప్రేరణ ను అందించి దేశభక్తిని మేల్కొల్పడమే దీని లక్ష్యం. కూకట్ పల్లి జిల్లా ఉత్సవ సమితి అధ్యక్షుడుగా రావుస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ పొలసాని ప్రభాకర్ రావు, జిల్లా ఉత్సవ సమితి కార్యధ్యక్షులుగా ప్రముఖ వ్యాపారవేత్త, భారత వికాస్ పరిషత్ సభ్యులు చింతపట్ల అనిల్ కుమార్ ఉంటూ అమృతోత్సవాల సందర్భంగా సంవత్సరం పాటు జరగబోయే కార్యక్రమాల విస్తృత సమాచారాన్ని, యోజనను తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ కూకట్ పల్లి భాగ్ అధికారులు, సంఘచాలకులు, సుభాష్ చంద్ర బోస్, సికింద్రాబాద్ విభాగ్ కార్యావః, భరతపుడి శ్రీనివాస్ , కూకట్ పల్లి భాగ్ కార్యావహ భాను ప్రకాష్ పాల్గొన్నారు.
ఉత్సవాల స్వరూపం…
- నవంబర్ 2022 లో యువకులు, కళాశాల విద్యార్థులతో యువ సమ్మేళనం
- జిల్లా లోని అన్ని బస్తిలలోని లక్షలాది కుటుంబాలకు తెలంగాణ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రేరణను జనజాగరణ ద్వారా తెలియచేయడానికి ప్రయత్నం.
- ప్రతిష్ఠిత వ్యక్తులు, మేధావులతో అన్నినగరాలలో సదస్సులు
- 17 సెప్టెంబర్ 2023 న బస్తిలలో త్రివర్ణపతాక వందనం తో నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను విజయవంతంగా పూర్తి చేస్తాం.