శంకర్ నగర్ ఫేజ్ 2 పురాతన వాటర్ ట్యాంకు కూల్చివేత 

పనులను పరిశీలించిన చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ ఫేజ్ 2 లో ఓవర్ హేడ్ వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. దాదాపు ఇరవై ఏళ్ల కిందట నిర్మించినది కావటంతో దీనిని కూల్చివేయాలని స్థానికులు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు దానిని కుల్చివేయాలని Ghmc అధికారులను ఆదేశించారు. వెంటనే గురువారం ఓవర్ హేడ్ ట్యాంకును కూల్చివేశారు.

శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకు కూల్చివేత పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ మంజుల  

ఈ పనులను కార్పోరేటర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీల్లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఉంటె తమ దృష్టికి తీసుకురావాలని వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఏ ఈ శివప్రసాద్ గారు డబ్ల్యూ ఐ హరీష్, కాలనీవాసులు రామయ్య, ధనంజయ్, గంగరాజు, నాగేశ్వరావు, ఎల్పీ రావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here