శేరిలింగంపల్లిని అన్నిరంగాల్లో  అగ్రగామిగా తీర్చిదిద్దుతా 

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన 

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ. 1 కోటి 68 లక్షల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ది ఆగకూడదనే ఉద్దేశ్యంతో సంక్షేమం , అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో, మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని గాంధీ పేర్కొన్నారు.

గోకుల్ ప్లాట్స్ లో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ గోకుల్ ప్లాట్స్ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరమని, గోకుల్ ప్లాట్స్ లో దశల వారిగా అభివృద్ధి చేపడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు బ్రిక్ శ్రీనివాస్ , గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, పితాని శ్రీనివాస్, సయ్యద్ గౌస్, సంజీవరెడ్డి, నాని, శివాజీ, MD ఇబ్రహీం, రాజు ముదిరాజ్, ఏసుపాదం, రాజేష్, కృష్ణ, ప్రసాద్, వీర రెడ్డి, దుర్గ రావు, వేంకటేశ్వరరావు, శ్రీనివాస్, నారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గాంధీ.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here