నమస్తే శేరిలింగంపల్లి: ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఫీడ్ ది నీడీ స్వచ్ఛంద సంస్థ ప్రశంసాపత్రాన్ని అందుకుంది. ములుగు జిల్లాలో ఫీడ్ ది నీడీ స్వచ్ఛంద సంస్థ చేసిన సామాజిక సేవలను గుర్తించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విప్ ప్రభాకర్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ చేతుల మీదుగా
ఫీడ్ ది నీడీ స్వచ్చంద సంస్థ తరపున వినయ్ వంగళ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఫీడ్ ది నీడీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు.