ప్రభుత్వ వైద్యులకు రవి కుమార్ యాదవ్ సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు చేసే సేవ ఎనలేనిదని అన్నారు. ప్రపంచంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేసే సమయంలో వైద్యులు తమ ప్రాణాలకు తెగించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ఈ మధ్య కూడా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు తగిన సూచనలిస్తూ అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని డాక్టర్స్ కు సూచించారు.  కార్యక్రమంలో డాక్టర్ అనూష, డాక్టర్ ప్రావీణ్య, రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యులను సన్మానిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here