నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ యువమోర్చా విభాగం శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ముత్యాల అఖిల్ నియామకమయ్యారు. ఈ మేరకు శేరిలింగంపల్లి, చందానగర్ డివిజన్ల యువమోర్చా అధ్యక్షులు క్రాంతి మాదిగ, ఫిరంగి మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా నియామకపు పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ముత్యాల అఖిల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పిన భారతీయ జనతా పార్టీ పెద్దలకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాషాయ జెండాను ఎగర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.