నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు చేసే సేవ ఎనలేనిదని అన్నారు. ప్రపంచంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేసే సమయంలో వైద్యులు తమ ప్రాణాలకు తెగించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ఈ మధ్య కూడా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు తగిన సూచనలిస్తూ అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని డాక్టర్స్ కు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ అనూష, డాక్టర్ ప్రావీణ్య, రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.