నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం పట్టణ ప్రగతి అని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఫేస్-1,2,3,4,5 అపార్ట్మెంట్, జనప్రియ నగర్ 1, 2 లలో జీహెచ్ఎంసీ అధికారులు, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి స్థానిక కార్పొరేటర్ పూజిత గౌడ్ పర్యటించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పట్టణ ప్రగతిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పక్క ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
అధికారులు డీఈ సురేష్, ఏఈ ప్రతాప్, మేనేజర్ మానస, శానిటేషన్ ఎస్ ఆర్ పీ మహేష్, నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, లక్ష్మా రెడ్డి, ప్రవీణ్ గౌడ్, నరేందర్ గౌడ్, ఉమామహేశ్వర, వార్డు సభ్యులు శేఖర్ ముదిరాజ్, కనకమామిడి వెంకటేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, రాము, లక్ష్మణ్ గుప్త, మల్లేష్ గౌడ్, రవి, వేణు, ఉమేష్, సురేష్, శ్రీనివాస్, వెంకట్ సుబ్బయ్య, షేక్ సాబేర్, నదీమ్, జితేందర్ రెడ్డి, మహేష్, అశోక్, కొండల్, శ్రీనివాస్, కోటి, రాథోడ్, మోహన్, నాగభూషణం, రమేష్, పరమేశ్వర, వాసుదేవ రావు, రవి కుమార్, శివాజీ, మస్తాన్, సత్యనారాయణ, మహిళలు శాంతి, రమ్య, జ్యోతి రెడ్డి, సుచిత్ర, శిరీష, లక్ష్మి, మృదుల,వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎలక్ట్రికల్ కలీల్, వాటర్ వర్క్స్ సిబ్బంది అంబదాస్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.