నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో నాలా విస్తరణలో భాగంగా సత్యనారాయణ ఎన్ క్లేవ్ వద్ద కోటి 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజా అవసరాల మేరకు నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుడదని, పనులలో వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ ఎస్ ఈ శంకర్ నాయక్,ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.