నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురానగర్ లో ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట చేపట్టారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి నీరు, సీసీ రోడ్ల పనితీరుపై తనిఖీ చేశారు. హెచ్ఎండబ్ల్యుఎస్ అధికారులతో మాట్లాడి కాలనీలో అదనంగా మంచి నీటి పైపు లైను నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీ వాసులకు స్వచ్ఛమైన మంజీరా నీటిని అందించాలనే లక్ష్యంతో నూతనంగా పైపు లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అన్ని ప్రాంతాల్లో మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, తిరుపతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, గచ్చిబౌలి డివిజన్ మహిళా ప్రధాన కార్యదర్శి పూజ, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్, అరుణ్ గౌడ్, వరలక్ష్మి, ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.