నమస్తే శేరిలింగంపల్లి: వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మాసి ఉల్లా ఖాన్ ను ప్రముఖ వ్యాపారవేత్త, కొండాపూర్ డివిజన్ టీఆర్ఎస్ యువ నాయకులు అఖిల్ పటేల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాసి ఉల్లా ఖాన్ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా నియమితులవడం సంతోషంగా ఉందన్నారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్బర్ బిన్ తాబేర్, సురేష్ పటేల్, మొహమ్మద్ ఫరాన్, అబ్దుల్ కరీం, కొండాపూర్ డివిజన్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






