నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల సంఘాల వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ సగర సంఘం కార్యాలయ భవనం అదనపు అంతస్తు నిర్మాణానికి రూ. 25 లక్షల నిధులు మంజూరు చేసి స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగర సంఘం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని విప్ గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ సాగర్, సెక్రటరీ సత్యం సాగర్, హైదరాబాద్ సగర సంఘం ప్రెసిడెంట్ ఎమ్. రవి సాగర్, యూత్ ప్రెసిడెంట్ సీతారామ్ సాగర్, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, సెక్రటరీ సురేష్ సాగర్, ట్రెజరర్ రవి సాగర్, యూత్ ప్రెసిడెంట్ డి. సాయి బాబు సాగర్, ట్రెజరర్ ప్రవీణ్ సాగర్, దిండి తిరుపతయ్య, అశోక్ సాగర్, కృష్ణ సాగర్, కొండాపూర్ డివిజన్ సెక్రటరీ జె. బలరాం యాదవ్, టీఆర్ఎస్ నాయకులు నరసింహ సాగర్, జంగం గౌడ్, రవి శంకర్ నాయక్, విక్రమ్, బసవ రాజు, అశోక్ సాగర్, హీనాయత్, గణపతి, బుడుగు తిరుపతి రెడ్డి, నరేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.