రూ. 15 లక్షలతో మంచినీటి పైపులైన్ పనులు ప్రారంభం – ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మంజీరా మంచినీటి సరఫరా కోసం నూతన పైపులైన్ పనులు చేపట్టనున్న దృష్ట్యా కలుషిత నీటి సరఫరా సమస్య తీరనుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ‌ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ గిడ్డంగి వద్ద సుమారు రూ.15 లక్షల అంచనా వ్యయంతో మంచినీటి నూతన పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారానగర్ గిడ్డంగి ప్రాంతంలో పాత పైపులైన్ తొలగించి నూతన పైపులైన్ పనులను వేయనున్నట్లు తెలిపారు. దీంతో కలుషిత నీటి సమస్య పరిష్కారం కానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ వార్డు మెంబర్లు, బస్తీ కమిటీ ప్రెసిడెంట్లు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తారానగర్ గిడ్డంగిలో మంచినీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here