రాయదుర్గంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన సాయిబాబా

నమస్తే శేరిలింగంపల్లి: కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. రంజాన్ పండగను పురస్కరించుకుని సీఎం‌ కేసీఆర్ అందజేసిన రంజాన్ తోఫాలను గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ముస్లిం బస్తీలో ముస్లిం సోదరులకు కొమిరిశెట్టి సాయిబాబా చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా రంజాన్ కానుకలను పంపడం ఆనవాయితీగా మారిందన్నారు. ముస్లింల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సంపత్, నరేష్, అక్బర్, సలావుద్దీన్, లియాకత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్న గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here