అరంగేట్రంతో ఆద్యంతం అలరించిన మిచెల్లె భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పకళావేదికలో మిచెల్లె జోస్ భరతనాట్య ప్రదర్శనతో అరంగేట్రం చేసి అందరిని అలరించింది. భరతనాట్య గురువు సంతోష్ కుమార్, తమాంగ్ కుమార్ తమాంగ్ పర్యవేక్షణలో కళాకారిణి మిచెల్లె అరంగేట్రంతో చేసిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. నృత్యకారిణి మిచెల్లె జోస్ గత కొన్ని సంవత్సరాలుగా గురువు సంతోష్ కుమార్ పర్యవేక్షణలో నారాయణి నృత్యాలయంలో శిక్షణ పొందుతుంది. ఒక వైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే మరోవైపు తనకిష్టమైన సాంప్రదాయ నృత్యం భారతనాట్యంలో ప్రావీణ్యం పొంది తన గురువు సమక్షంలో మొదటిసారి భరతనాట్య ప్రదర్శన చేసింది. ఈ ప్రదర్శనల్లో పుష్పాంజలి, అలరింపు, జతిస్వరం, శబ్దం, పడవర్ణం, నట్ట నమదిర్, భజన, తిల్లాన అంశాలను భరతనాట్య నృత్యరూపకంలో ప్రదర్శించగా సంతోష్ కుమార్ నట్టువాంగణం అందించగా, వోకల్ జయకుమార్, మృదంగం శ్రీనివాస్, కర్ర వెంకటేశ్వర్లు, వీణ సుధాకర్ రావు, ఘటం రవి సమకూర్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here