కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుదాం – మే డే వేడుకల్లో సీఐటీయూ జిల్లా నాయకులు శోభన్

నమస్తే శేరిలింగంపల్లి: కార్మికుల హక్కుల సాధనలో భాగంగానే మే డే ఏర్పడిందని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ నాయకులు శోభన్ అన్నారు. అంతర్జాతీయ కార్మికుల వేడుక మే డే ను పురస్కరించుకొని చందానగర్ డివిజన్ పరిధిలోని తారా నగర్ సబ్ స్టేషన్ లో సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కేకు కట్ చేయించి మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ నిరంతరం కార్మికుల హక్కుల కోసం ఎర్రజెండా ముందుంటుందని అన్నారు. కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై అనునిత్యం పోరాటం చేసే జెండా ఒక్క ఎర్ర జెండా మాత్రమే అని గుర్తు చేశారు.

తారానగర్ సబ్ స్టేషన్ లో సీఐటీయూ జెండాను ఆవిష్కరించిన శోభన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రుల జీతాలు పెంచుకునే ఓపిక ప్రభుత్వాలకు ఉంది తప్ప అనునిత్యం ప్రజలకు సేవ చేసే కార్మికుల జీతభత్యాల విషయంలో రెండు ప్రభుత్వ విధానాలు ఒకే విధంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు లెనిన్, శేరిలింగంపల్లి సీపీఎం సీనియర్ నాయకులు మాణిక్యం, సిఐటియు నాయకులు కృష్ణ, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో కేకు కట్ చేయిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here