ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో ఆదివారం యంపీ థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలను  నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ చక్ర డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణపతి కౌతం, జతిస్వరం, ముద్దుగారేయ్ యశోద, పలుకీ బంగారమయేహ్న, కృష్ణ జనన శబ్దం, నమః శివాయతేయ్, గరుడ గమన, అష్ట లక్ష్మి, చక్కని తల్లి, డోలాయంచాల, వినరో భాగ్యము, తందనాన భళా తందనాన తదితర అంశాలపై కోమల, గ్రీష్మ, శ్రీష్మ, వరుణ ప్రియా, స్పందన, అశ్విత, సహస్ర, వర్షిణి, వేదశ్రీ, డాక్టర్ ఆశ రాణి, డాక్టర్ ఉష రాణి తదితర కళాకారులు ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథులుగా నాట్య గురువులు డాక్టర్ ప్రసన్న రాణి, సుందరి రవిచంద్ర, చంద్రశేఖర్ హాజరై కళాకారులను ప్రశంసా పత్రాలతో సత్కరించి అభినందించారు.

శిల్పారామంలో చిన్నారుల నృత్యప్రదర్శనలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here