మహిళాభ్యున్నతి కోసం కేసీఆర్ కృషి మరవలేనిది – మాదాపూర్ డివిజన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం‌ కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను‌ పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో మహిళా‌బంధు కేసీఆర్ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టారు.

మాదాపూర్ లో మహిళా‌ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్‌ గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను‌ గుర్తు చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టి ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు మహిళలకు ఎంతో చేయూతనిస్తున్నాయని అన్నారు. కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ, సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజుల పాటు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రోజి, మున్సిపల్ మహిళా కార్మికులు, ఆశా వర్కర్లను ఎమ్మెల్యే, కార్పొరేటర్లు సన్మానించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్ సిబ్బందిని సన్మానిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here