నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థి దశలోనే సృజనాత్మకత ను వెలికితీసేందుకు సైన్స్ ఎక్స్ పో ఎంతగానో దోహదపడుతుందని సీఎంఆర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మదీనగూడ త్రివేణి పాఠశాల క్యాంపస్ లో సైన్స్ ఎక్స్ ఫో సంబరాలు ఘనంగా నిర్వహించారు. త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సీఏసీ నటరాజ్, సీఆర్ఓ సాయి నరసింహారావు, వైస్ ప్రిన్సిపాల్ హిమబిందు ఆధ్వర్యంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్ ఫో సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి. కరోనా వ్యాధి మహమ్మారి తర్వాత ఏర్పాటు చేసిన ఈ వేడుకలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.