నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం నానక్ రాంగూడ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్ సాయి బాబా ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాయదుర్గం, నానక్ రాంగూడ కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రమేష్, కాలనీ వాసులు అక్బర్, వాజిద్, మన్సూర్, ఖాదర్ ఖాన్, మాక్బూల్, షేక్ అక్బర్, మజీద్ తదితరులు ఉన్నారు.