గిరిజనులకు దిశా నిర్దేశం చేసిన మార్గదర్శి సేవాలాల్ మహారాజ్ – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: దేశం కోసం, ధర్మం పట్ల అంకితభావంతో విశిష్ట సేవలందించి చిరస్మరణీయులుగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచిపోయారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేస్ 2 లో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 283 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళ, శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీ మోహన్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొని ‌పూజలు చేశారు. సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భారతదేశం సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంతో పాటు‌ గిరిజ‌నుల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతులు సేవాలాల్ సంత్ మహారాజ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సేవాలాల్ మహారాజ్ సేవలను కొనియాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బంజారాలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here