నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర షెల్టర్స్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీ లో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా చూస్తానని, పార్కులో స్ట్రీట్ లైట్స్ వీలైనంత త్వరగా ఏర్పాటు చేయిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంతోష్, వేణు, రవి, నర్సింహారెడ్డి, పవన్, గోపాల్ యాదవ్, స్థానిక కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.