నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ బస్ డిపో వద్ద గల కాళీ మాత ఆలయంలో శుక్రవారం శ్రీ కనక దుర్గమ్మ మాతకు స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. మాఘ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ శుక్రవారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాచమల్ల కృష్ణా పటేల్ గౌడ్, చీఫ్ అడ్వైజరీ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి తెలిపారు. మియాపూర్ బస్ డిపో బొల్లారం రోడ్డు పక్కన శ్రీ కనకదుర్గమ్మ, కాళీ మాత ఆలయాన్ని స్థానికుల సహాయంతో 2002 సంవత్సరంలో నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. తక్కువ మందితో భక్తుల సహాయంతో ప్రారంభించుకున్న ఆలయం రోజురోజుకు భక్తుల సంఖ్య పెరగడంతో అందరి సహాయసహకారాలతో ఆలయంలో కాళీ మాత, అభయాంజనేయ స్వామి, శివలింగం, నవగ్రహాలు, ఆది పరాశక్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత తదితర విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆలయం వెనుక మీదికుంటను కొంతమంది కబ్జా చేయడానికి పాల్పడుతున్నారని, కబ్జాదారుల నుంచి కుంటను రక్షించడానికి కుంటను అభివృద్ధి చేసేందుకు ఆలయ కమిటీ నిర్ణయించిందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహశీల్దార్ అనుమతి తీసుకుని చెరువులో పిచ్చి మొక్కలను తొలగించి, సుందరీకరణ కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ పి. అనిల్ గౌడ్, జనరల్ సెక్రటరీ జి. శ్రావణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ హరి, బాలాజీ రావు, సురేష్ ,గోపి, ఆర్గనైజ్ సెక్రెటరీ కె. పాపిరెడ్డి, టి. నాథ్, శ్రీనివాస రెడ్డి, కోశాధికారి ఈ. రాజు, అడ్వైజరీ లు కె.రాజ్ కుమార్, కె. వెంకటేష్, బి. శ్రీనివాస్, మెంబర్స్ శ్రీనివాస్ గౌడ్, జి. శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సందీప్, ప్రకాష్, రేఖ, కిషోర్, పి. కిరణ్, శ్రీనివాస్ గౌడ్, రాజేష్ పంతులు, భక్తులు పాల్గొన్నారు.