నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఇంచార్జీగా రాష్ట్ర దళిత మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ పీఎస్ రాహుల్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా పరిధిలో బిజెపి దళిత మోర్చా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా సికింద్రబాద్ మహంకాళి జిల్లా ఇంఛార్జిగా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషాకు, సహకరించిన పార్టీ పెద్దలకు ప్రత్యేకంంగా కృతజ్ఞతలు తెలిపారు.