సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి నిజాంపేట్ మిత్ర హిల్స్ వరకు నిర్మించిన సమాంతర రోడ్డు లో రూ. 11 లక్షల అంచనావ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించుకోవడం సంతోషకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి నిజాంపేట్ మిత్ర హిల్స్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం ను స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి దీపాల ఏర్పాటుతో రోడ్డుకి కొత్త శోభ వచ్చిందన్నారు. హైదర్ నగర్ డివిజన్ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్ ఏఈ మృదుల, లైన్ మెన్ సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, పోతుల రాజేందర్, కోనేరు రంగ ప్రసాద్, వీరపనేని శ్రీనివాస్, వేదమూర్తి, వెంకటేష్ యాదవ్, భూపాల్ రెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ, అష్రాఫ్, ఖదీర్, బాలయ్య, కుమార్ స్వామి, శ్రీహరి, శ్రీనివాస్, అప్పిరెడ్డి, నర్సింగ్ రావు, రాజు సాగర్, కృష్ణ ముదిరాజ్, సత్తార్, యాసిన్, సుధాకర్ రెడ్డి, కృష్ణ కుమారి, పద్మ, మాదవి తదితరులు పాల్గొన్నారు.

హైదర్ నగర్ డివిజన్ లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన ప్రభుత్వ‌విప్ గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here