నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన ఎమ్మెల్సీ తాత మధును ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ గా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వ విప్ గాంధీ ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ మధుకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ఎమ్మెల్సీ మధును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ కమ్మ సేవా సంఘాల సమన్వయ సమితి సభ్యులు అడుసుమిల్లి వెంకటేశ్వర రావు, చాపరాల శ్రీనివాస్ దాస్, తాళ్ళూరు చంద్రమౌళి, తమ్మినేడి కృష్ణం రాజు చౌదరీ, బొడ్డు రవిశంకర్ రావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు కోనేరు రంగ ప్రసాద్, వీరపనేని శ్రీనివాస్, సైదేశ్వర్ రావు, బ్రిక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.