నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్ లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలిసి పాదయాత్ర ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. కాలనీ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, మ్యాన్ హోల్ టు మ్యాన్ హోల్ వరకు ఎయిర్ టెక్ మిషన్ ద్వారా పూడికను తొలగించడం జరిగిందన్నారు. డ్రైనేజీ నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన చెత్త చెదారం ను తీసివేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
ప్రజల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. కొండాపూర్ డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్ , ఏఈ జగదీష్, జలమండలి మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు రాజు యాదవ్, గంగారాం యాదవ్, మాదాపూర్ గ్రామస్తులు శాస్త్రి, ఇంద్రసేన ముదిరాజ్, నర్సింగ్ యాదవ్, కిషన్, నర్సింగ్, ఠాకూర్, గోపాల్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.