కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పట్టభద్రులను కలసి అభ్యర్ధించారు. ఫాం 18 ను వారికి అందజేసి ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. గచ్చిబౌలి మీనాక్షి బాంబూస్ విల్లాస్, రాజరాజేశ్వరి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఎ బ్లాకులో ప్రతి ఇంటికి తిరిగి పట్టభద్రులను కలవటం జరిగిందన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన ప్రతి ఒక్కరి చేత కూడా ఎమ్మెల్సీ ఓటరు నమోదును స్వయంగా అక్కడే ఉండి నమోదు చేయిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా మంచి స్పందన కనబరుస్తున్నారని అన్నారు.
కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట వార్డు మెంబర్ జంగం గౌడ్, విజయ్ కృష్ణ, మధు ముదిరాజ్, అజయ్ సింగ్, మీనాక్షి బాంబుస్ విల్లాస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, పి నాగేంద్ర, సందీప్, వంశీ, మహేష్, లవ కుమార్, భరత్, రాము, శ్రీనివాస్ రావు, రాకేష్, రామారావు, శంకర్, అక్షయ్, డా. రామకృష్ణ దేసవాయి, జగన్, సోమరాజు, శివ కుమార్, కాలనీ వాసులు ఉన్నారు.