నిర్మాణం పనుల్లో నాణ్యత పాటించాలి- మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనకు కృషి చేసి దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీలో  నూతనంగా నిర్మిస్తున్న సిమెంటు రోడ్డు పనులను జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచీనీరు, విద్యుత్ దీపాలు తదితర వాటిని దశల వారీగా ఏర్పాటు చేస్తామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని అన్నారు. త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ప్రేమ్, నాయకులు లసాని రాజు, రాజు గౌడ్, శివ ముదిరాజ్, జంగం మల్లేష్, నర్సింహ గౌడ్, మహేష్ ముదిరాజ్, జలీల్ మియా, వీరేశం, నర్సింహ గౌడ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here