నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సుభాష్ చంద్రబోస్ కాలనీ వాసులు ప్రభుత్వ విప్ గాంధీని కలిసి పలు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ విప్ గాంధీ స్పందిస్తూ కాలనీ లో నెలకొన్న అన్ని సమస్యల ను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా ఉన్న రోడ్లను వేస్తామని, త్వరలోనే పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరావు, అబ్దుల్ రహమాన్, రహీం, ముక్తార్, రాములు యాదవ్, రామకృష్ణ, అంకారావు, ఉమ, బుజ్జి, శశిరేఖ, విజయ రెడ్డి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.