నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తిరుపతి రావు ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్, ఓబీసీ మోర్చా నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ యాదవ్, నవీన్ మునిగొండ, సాయి గౌడ్, మైనార్టీ సెల్ నాయకులు సలీం తదితరులు పాల్గొన్నారు.