నమస్తే శేరిలింగంపల్లి: పవిత్ర క్రిస్టమస్ పండుగ సందర్బంగా క్రైస్తవులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రిస్టమస్ కానుకలను అందజేయడం ఆనవాయితీ గా వస్తోందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని దీప్తి హిల్స్ లో సెమి క్రిస్టమస్ సంబరాల్లో కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. డివిజన్ లోని క్రిస్టియన్ కమిటీ, అన్ని చర్చి పాస్టర్లకు పవిత్ర పండుగ క్రిస్మస్ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించిన కానుకలను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక క్రైస్తవులకు పవిత్ర క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కేసీఆర్ గారు క్రైస్తవ సోదరిమనులకు నూతన వస్త్రాలు కానుక పంపించడం ఆనవాయితీగా మారిందని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి పండుగకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి తమ ఇంటి ఆడపడుచులుగా భావించి నూతన వస్త్రాలను ఇవ్వడం అనేది గొప్ప విషయం అని అన్నారు. క్రిస్మస్ పండగను కరోనా నిబంధనలు పాటిస్తూ ఆనందోత్సవాక మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ అందరిపై ప్రభువు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సయ్యద్ గౌస్, శ్యామ్, మాదాపూర్ డివిజన్ క్రిస్టియన్ మైనారిటీ సంఘం అధ్యక్షులు పాల్ ప్రసాద్, పాస్టర్లు సామసన్, సెల్వరాజ్, మధు, జైచందర్, మనోహర్, శ్రీపతి, లింగబాబు తదితరులు పాల్గొన్నారు.