డ్రైనేజీ పనులను పరిశీలించిన భేరి రాంచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ నగర్ లోని చెరువు పక్కన ఉన్న కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేక మురికి నీరంతా ఇళ్లల్లోకి వచ్చి చేరడంతో ఇబ్బందులు తలెత్తేవి అన్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి సమస్యను వివరించగా జీహెచ్ఎంసీ నుంచి రూ. 20 లక్షల నిధులతో యూజీడీ పనులు చేపట్టడం జరిగిందన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులకు భేరి రాంచందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాయుడు, రవి నాయక్, సత్యక్క, అన్నదొరై తదితరులు ఉన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న భేరి రాంచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here