నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధి చేస్తామని స్థానిక కార్పొరేటర్ మంజుల రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలో రూ. 40 లక్షల తో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ పనులను కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఏఈ రమేష్, వర్క్ ఇన్ స్పెక్టర్ హరీష్, కాలనీ వాసులు పద్మ, శ్రీనివాస్ రెడ్డి, నాగి రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, అశోక్ రెడ్డి, మంగి రెడ్డి, మల్లా రెడ్డి, రమణా రెడ్డి, సురేందర్ రెడ్డి, పి. సుధాకర్ రెడ్డి, రుక్మనాధ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.