నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోట సారీస్, పోచంపల్లి, నారాయణపేట, గొల్లబామ, బాందిని, పుల్కారి చీరలు, కాశ్మీరీ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్స్, వరంగల్ డరీస్, లెథర్ లాంప్స్, వాల్ హ్యాంగింగ్స్, భాగల్పూరి సారీస్, కాంత వర్క్ చీరలు, పెయింటింగ్ సారీస్, మట్టి తో తయారు చేసిన పాత్రలు, చెక్కనపు విగ్రహాలు, ఇత్తడి పాత్రలు, డెకొరేటివ్ ఐటమ్స్, చెక్క కుర్చీలు, కార్పెట్స్, డోర్ మాట్స్, బేడీషీట్స్, ఎన్నో రకాల హస్తకళా ఉత్పత్తులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం కుమారి జ్యోతిర్మయి పట్నాయక్ బృందం చేసిన ఒడిసి నృత్య ప్రదర్శన అలరించింది. కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా కీ శే ఇందిరా ముసునూరి శిష్య బృందం ప్రదర్శనలో భాగంగా మూషిక వాహన, దీపాంజలి, వినాయక కౌతం, వేంకటాచల నిలయం, వందేమాతరం, తదితర అంశాలపై కళాకారులు సాత్విక, యోగీతాశ్రీ, యుక్త, సరయు, తన్వి కృతి, నయన ప్రదర్శించి ఆకట్టుకున్నారు.