నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ రోడ్డు నంబర్ 6 లో సీసీ రోడ్డు పనులను చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. రూ. 19.8 లక్షలతో సీసీ రోడ్డు పనులను చేపట్టడం జరిగిందని మంజులరఘునాథ్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కాలనీ వాసులు సుబాష్ చంద్రబోస్, మల్లికార్జున్ రెడ్డి, శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, అరుణ్, సతీష్, మానయ్య, రియాజుద్దీన్, నరేష్, ఏఈ రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ హరీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.