నార్నె గోకుల్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం – నిరూపించకుంటే పరువునష్టం దావా వేస్తాం: ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: నార్నె గ్రూప్స్ ఆప్ కంపెనీ సీఈఓ నార్నె గోకుల్ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవాలు లేవని, చేసిన ఆరోపణలను నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. కొండాపూర్ లోని నార్నే ఎస్టేట్ సెంట్రల్ పార్క్ ఫేజ్ 2 అంశాలపై సీఈఓ గోకుల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు‌ కార్యాలయంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

సెంట్రల్ పార్క్ ఫేజ్ 2 అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు కాలనీలో మౌళిక వసతుల కల్పన కోసం కాలనీలో పర్యటించినట్లు తెలిపారు. ప్రజలతో మమేకమై పనిచేస్తున్నని, మేము చేస్తున్న అభివృద్ధి ని అడ్డుకోవడం కోసం తమ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నార్నె గోకుల్ చేసిన ఆరోపణలను నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తామన్నారు. ఎలాంటి చాలెంజ్ కైనా సిద్దం అని చెప్పారు. 50 మంది రౌడీలను పెట్టి కాలనీ వాసులను బెదిరింపులకు గురి చేసింది నార్నే కంపెనీ‌ వారన్నారు. నార్నె గోకుల్ కు ఎప్పుడూ ఫోన్ చేయలేదని, వారి సిబ్బందిని ఇబ్బంది పెట్టలేదని అన్నారు. సెంట్రల్ ఫేజ్ 2 లో మౌలిక వసతుల కల్పన కోసం అసోసియేషన్ వారు మాకు చేసిన వినతి మేరకు అధికారులతో కలిసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని‌ చెప్పారు. కాలనీలో పార్కులను అభివృద్ధి చేయకుండా నార్నే సంస్థ వారు తాళాలు వేశారని, వాటి తాళాలు‌ తీయించి కాలనీ‌ వాసులకు ఇచ్చామన్నారు. కాలనీలోని ఖాళీ స్థలంలో షెడ్ వేసి వినాయక ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని, ఆ స్థలంలోనే దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని వివరించారు. లే అవుట్ స్థలమని దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు నార్నే సంస్థ 50 మంది రౌడీలను పంపి అడ్డుకున్నారని చెప్పారు. శంకుస్థాపన చేసింది పగటిపూట అయితే అర్థరాత్రి చేశార‌ని నార్నె గోకుల్ ఆరోపిస్తున్నారని అన్నారు. లే అవుట్ ప్రకారం దిగువ భాగం చూసి సివరేజ్ పైపులైన్లు వేయించడం జరిగిందన్నారు. పనులు జరిగేటప్పుడు సైతం అధికారులను కాలనీ వాసులను భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు. అక్రమార్జన కోసం వంకర మార్గాలు ఎంచుకున్నారని, లే‌ అవుట్ లో ప్లాట్లు కొన్నవారు చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారని అన్నారు. స్థల యజమానులు నార్నే సంస్థ పై కేసులు పెట్టారన్నారు. ప్లాట్లు కొన్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని, చేసిన అన్యాయాలను బయట పెట్టి పోలీస్ స్టేషన్ లో దోషిగా నిలబెడతానని నార్నె గోకుల్ కు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సవాల్ విసిరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here