నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్థరాత్రి దొంగలు స్వైర విహారం చేశారు. కిరాణా షాపులు లక్ష్యంగా చేసుకుని మూసి ఉన్న షట్టర్లను తెరిచి డబ్బులు దోచుకెళ్లారు. చందానగర్ పీఎస్ పరిధిలోని హుడా కాలనీలో ఒక షటర్ లేపి కౌంటర్ లో నుంచి రూ. 10 వేలు దొంగతనం చేసినట్లు చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డి తెలిపారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ లో తాళం వేసిన కిరాణా శాపులే లక్ష్యంగా చేసుకొని 3 వేర్వేరు చోట్లా దొంగతనాలకు పాల్పడినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. మదీనా గూడ దీప్తిశ్రీ నగర్ కాలనీలలో అర్థరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు స్కూటీ పై తిరుగుతూ తాళం వేసిన కిరాణా షాపుల వద్దకు వెళ్లి ముగ్గురిలో ఇద్దరు షట్టర్ వంచడం ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి నగదు దొంగిలించడం. ప్రధాన రహదారులపై ఉన్న షాపుల్లోనే జరగడం గమనార్హం. మరో 3 దుకాణాల చోరీకి ప్రయత్నం చేసి షట్టర్లు తెరుచుకోకపోవడంతో విరమించుకున్నారు. రెండు షాప్ ల లో మహలక్ష్మి కిరాణా నుంచి రూ. 50వేలు, గణేష్ కిరాణా షాపు నుంచి రూ.15 వేలు దొంగతనమైనట్లు సీసీ పుటేజి ఆధారంగా గుర్తించారు. సదరు షాపు యజమానులు ఇచ్చిన పిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







